![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -691 లోకి అడుగు పెట్టింది. కాగా సోమవారం నాటి ఎపిసోడ్ లో వసుధార తనకు తానుగా మెడలో వేసుకున్న తాళి గురించి అందరికి తెలిసినా ఎవరు నిజం చెప్పకపోవడంతో రిషి ఆవేశంతో వసుధారపై కోప్పడతాడు.
ఇప్పుడు మీరంతా హ్యాపీగా ఉన్నారా? ఇక సమస్యలన్ని తీరిపోయాయని అనుకుంటున్నారా? అసలు సమస్య ఇప్పుడే మొదలైందని రిషి అంటాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. నువ్వు తాళిని మెడలో వేసుకోవడం అంత ఈజీనా? ఇప్పుడు నువ్వు ఆ తాళిని తియ్యగలవా? అని రిషి అడిగే ప్రశ్నలకు తలదించి మౌనంగా ఉండిపోతుంది వసుధార. రిషి అడిగే ప్రతిదాంట్లో నిజం ఉంది కాబట్టి జగతి, మహేంద్ర, చక్రపాణిలు సైలెంట్ గా రిషి మాటలను వింటూ ఉంటారు. "నేను పొరపాటు చేశానని అంటున్నారా సర్" అని వసుధార అడుగుతుంది. అలా అనగానే.. నువ్వు చేసింది పొరపాటు కాదు.. తప్పు.. పెద్ద తప్పు అని రిషి అంటాడు. ఆ తర్వాత వసుధార మౌనంగా ఉంటుంది. "నువ్వు ఇంత ఈజీగా తీసుకుంటున్నావ్? నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదిది.. పిచ్చివాడిలా మిగిలిపోయాను తెలుసా? వసుధార నువ్వు చేసిన దాన్ని ఒక్కరైనా సమర్థిస్తారా? అని రిషి ఆవేశంగా అంటాడు.
"నాకు మన బంధం ముఖ్యం, మీ ప్రేమ ముఖ్యం.. నాకింక ఈ సమాజంతో పనేముంది సర్" అని వసుధార అంటుంది. సమాజంతో పనేముందని అనుకునేదానివి నీ మెడలో అందరికి కన్పించేలా ఆ తాళి ఎందుకు వేసుకున్నావ్? అని రిషి ప్రశ్నించగా.. నాకు వేరే ఆప్షన్ లేదు సర్ అని వసుధార చెప్తుంది. కానీ వసుధార చెప్పేదేదీ వినిపించుకోకుండా.. "అంత అయిపోయిందని అనుకుంటున్నావా? మరి అందరికి ఏం సమాధానం చెప్తావ్? నాకు పెట్టినట్లే అందరికి పరీక్షలు పెడతావా? చెప్పుకోండి చూద్దాం అంటావా? నాకు ఎందుకు నిజం చెప్పలేదు" అని రిషి అడుగుతాడు. కాసేపటికి చక్రపాణి కాఫీ తీసుకురాగ.. రిషి కూల్ అయి ఆ కాఫీ తాగేసి వెళ్ళిపోతాడు.
తర్వాత రిషి ఇంట్లో అందరూ భోజనం చేస్తుండగా.. రిషి సంతోషంగా కన్పించడంతో అసలేమైందనే ఆలోచనలో దేవయాని ఉంటుంది. రిషి వాళ్ళింటికొచ్చిన తర్వాత వసుధార గురించి.. "ఆ పొగరు తిన్నదో లేదో" అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |